కొత్తగా వివాహం చేసుకునే జంటలకు సర్కారులు అనేక చోట్ల పలు పథకాలు పెడుతున్నాయి, నగదు సాయం చేస్తున్నాయి, కొందరు బంగారం ఇస్తున్నారు, అయితే ఇప్పుడు ఇలాంటి ఓ పథకం దేశంలోనే అందరిని ఆకట్టుకుంటోంది,
నూతన వధువులకు 10 గ్రాముల బంగారాన్ని బహుమతిగా ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్నట్లు అసోం రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇక పేదలు ఎవరు అయితే ఉన్నారో వారికి, ఈ గోల్డ్ స్కీమ్ ఇవ్వనున్నారు, తక్కువ ఆధాయం ఉన్న కుటుంబాల్లో యువతులకి
అరుంధతి గోల్డ్ స్కీం కింద అసోం ప్రభుత్వం ఒక తులం బంగారాన్ని బహుమతిగా అందించాలని నిర్ణయించింది. దీని కోసం స్కీమ్ లో భాగంగా బడ్జెట్ లో రూ.300కోట్లను కేటాయించింది.
గత ఏడాది అరుంధతీ గోల్డ్ స్కీంను ప్రకటించిన సర్కారు ఈ ఏడాది బడ్జెట్ లో నిధులు కేటాయించింది. 5 లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల్లోని పెళ్లి కుమార్తెకు ఇది ఇవ్వనున్నారు, ఇక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఎప్పుడు వధువు వరుడు పెళ్లి అయినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో అప్పుడు ఈ స్కీమ్ కు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.