ఏపీలో భూముల ధరల పెంపుపై సర్కార్ కీలక నిర్ణయం..

0
115

ఏపీలో నిన్నకొత్త జిల్లాల ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. దాంతో నిన్నటి నుండి ఏపీలో కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభమైంది. అందుకు కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్ విలువను సవరించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 6 నుంచి భూముల విలువ సవరిస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ఏపీలో నూతనంగా ఏర్పాటు చేసిన 13 జిల్లాల్లో మాత్రమే చార్జీల సవరణ వర్తిస్తుందని సి ఎస్ రజత్ భార్గవ తెలిపారు. కొత్త జిల్లాలో 15 శాతం వరకు ఈ పెంపు ఉండగా… మొత్తంగా సగటున 20 శాతం పైనే రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి.  ఆస్తుల విలువను బట్టి రిజిస్ట్రేషన్ల ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో కొంత మేర ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది.