ప్రయివేట్ టీచర్లకు చేసిన సాయం ఇదే : మంత్రి సబిత

0
99

కరోనా సమయంలో ప్రయివేటు పాఠశాలలు మూసివేసినందున ఆయా స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు సర్కారు సాయం చేసింది. ప్రతి టీచర్ కు నెలకు 2వేల రూపాయల చొప్పున అందజేసింది.

కరోనా వల్ల టీచర్లకు ప్రతి నెలా 2లక్షల 743 మందికి 40 కోట్ల 94 లక్షల 86 వేల రూపాయలు పంపిణీ చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు.

ఏప్రిల్, మే నెలలకు సంబంధించి 81 కోట్ల 89 లక్షల 72 వేల రూపాయలు అందించినట్లు  చెప్పారు.

అలాగే ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున రెండు నెలలకు సంబంధించి 38 కోట్ల 76 లక్షల 80వేల 870 రూపాయలు విలువ చేసే 10,237 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశామని తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా 11,046 ప్రయివేటు పాఠశాలల్లో పనిచేసేవారికి ప్రభుత్వం సాయం చేసినట్లు  వివరించారు. లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరూ ఆకలితో ఉండవద్దని సిఎం కేసిఆర్ ఆలోచన మేరకే ప్రయివేటు టీచర్లను ఆదుకున్నామని తెలిపారు.