గ్రూప్-1 ఇంటర్వ్యూ ఫలితాలు వెల్లడించండి: హైకోర్టు ఆదేశం

0
76

గ్రూప్-1 ఇంటర్వ్యూ ఫలితాలు వెల్లడించాలని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు హైకోర్టు ఆదేశించింది. గ్రూప్‌–1 మాన్యువల్‌ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, అందువల్ల ఇంటర్వ్యూలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ ఇంటర్వ్యూలు, నియామక ప్రక్రియ నిలుపుదలకు నిరాకరిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై వాదనలు విని కోర్టు తీర్పు వెలువరించింది.