గుడివాడ తన అడ్డాగా చెప్పుకునే కొడాలి నానికి ఈసారి ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వనున్నాయి అని అంటున్నారు తెలుగుదేశం నేతలు. కారణం కూడా చెబుతున్నారు కొడాలి నాని అధికారంలోకి వచ్చినా, ఇక్కడ జగన్ గెలవరు అని ఎందుకు అంటే ఏపీ అంతా బాబు వేవ్స్ ఉన్నా యి అని అంటున్నారు. ఈ సమయంలో జనాలు కూడా గ్రహించి కొత్తవారికి ఇక్కడ అవకాశం ఇవ్వాలని అనుకున్నారట. అందుకే ఇక్కడ నానికి ఈసారి ఓటమి తప్పదు అని చెబుతున్నారు.. పైగా వైసీపీ తరపున చేయించిన సర్వేల్లో మాత్రమే నాని గెలుస్తారు అని రిపోర్టులు వస్తున్నాయి. ఆ సర్వే రిపోర్టు మినహా, మరే రిపోర్టు కూడా నాని గెలుస్తారు అని చెప్పడం లేదు. బాబు చేయించిన సర్వేలో ఆ రిపోర్టుల్లో దేవినేని అవినాష్ భారీ మెజార్టీతో గెలవకపోయినా ఆయన గెలుపు ఖాయం అని వచ్చిందట. ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈసారి చాలా బాగా కష్టించి ఇక్కడ పనిచేశారు అని నానిపై ముఖ్యంగా మూడు మండలాలలో తీవ్రవ్యతిరేకత ఉందని, ఆయన అనుచరులు వర్గం వారు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటారు అని, నాని మా సమస్యలు వచ్చి అడిగింది ఈ ఐదు సంవత్సరాలలో లేదు అని అంటున్నారు.
పైగా అధికారంలో జగన్ లేరు కాబట్టి పనులు జరుగలేదు అని చెబుతున్నారు… ఇవన్నీ కూడా టీడీపీకి కలిసి వచ్చిన అంశాలు.. ఇక బీసీ ఓటు బ్యాంకు ఈసారి తెలుగుదేశం పార్టీకి పాజిటీవ్ అయింది అని అంటున్నారు పార్టీ శ్రేణులు.. ముఖ్యంగా ఇక్కడ కమ్మసామాజికవర్గం కూడా ఈసారి మార్పు కోరుకుంది అని, ప్రతీసారి నానికి కాకుండా కొత్తవారికి కూడా అవకాశం ఇవ్వాలి అని భావించి యువ నాయకుడు దేవినేని వారసుడికి కొందరు సపోర్ట్ అందించారు. అందుకే అవినాష్ కూడా తనదే గెలుపు అని ధీమాగా ఉన్నారట.