కేంద్రంలో నా సపోర్ట్ వారికే జగన్ కీలక నిర్ణయం

కేంద్రంలో నా సపోర్ట్ వారికే జగన్ కీలక నిర్ణయం

0
82

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయం అని తెలుస్తోంది.. ఇటు సర్వేలు చెప్పేదాని ప్రకారం జగన్ కే అధికారం అని చెబుతున్నారు.. ఇక తెలుగుదేశం పార్టీ మాత్రం ఇవన్నీ పుకార్లు అని కొట్టిపారేస్తుంది. ఇక కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ జగన్ తో చెలిమికి రెడీ అవుతున్నాయి. ఇటు తృతీయ పార్టీలు కూటమి కూడా జగన్ మద్దతు కోరుతోంది. అయితే జగన్ వీరిలో ఎవరికి మద్దతు ఇస్తారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతున్న అంశం.

జగన్ తన మద్దతు ఎవరికి ఇస్తారు అంటే వైసీపీ నేతలు చెప్పేదాని ప్రకారం , ఇప్పుడు ఏపీ చాలా ఆర్ధిక ఊబిలో చిక్కుకుంది.. లోటు బడ్జెట్ ఉంది. అందుకే కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా వారు కచ్చితంగా జగన్ చెప్పేది చేస్తేనే వారికి జగన్ మద్దతు ఇస్తారట. అంతేకాదు ఏపీకి సాయం చేయాలి, అమరావతి నిర్మాణానికి సాయం చేయాలి, అలాగే పార్టీ తరపున నేతలకు కేంద్ర మంత్రి పదవులు కూడా అడుగుతారట. అలాగే ఏపీకి ముందు ప్రత్యేక హోదా చట్టబద్దత కల్పిస్తూ హామీ ఇస్తే వారికి సపోర్ట్ చేస్తారట.. వీరి ముగ్గురిలో ఎవరికి మెజార్టీ సీట్లు వచ్చి, ఆ పార్టీకి మైనార్టీగా కొన్ని సీట్లు అవసరం అని సాయం కోరినా, జగన్ అదే చేస్తారు అని తెలుస్తోంది. అందుకే జగన్ కు ఎవరు అయినా సరే ఏపీకి పత్ర్యేక హోదా ఇస్తాము అని చెబుతున్నారట. మరి జగన్ మాత్రం నా సపోర్ట్ ఏపీకి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి అని చెబుతున్నారు. ఇక జగన్ నిర్ణయం పై ఇటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.