గుంటూరు మాజీ టీడీప నేతకు భారీ షాక్

గుంటూరు మాజీ టీడీప నేతకు భారీ షాక్

0
72

గుంటూరు తెలుగుదేశం పార్టీ నేతకు భారీ షాక్ తగిలింది… మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు… ఆయనకు సంబంధించిన ట్రాన్స్ ట్రయ్ కంపెనీలపై తనిఖీలు నిర్వహించారు…

అలాగే హైదరాబాద్ గుంటూరు విజయవాడ బెంగుళూరులో ఉన్న నివాసంలో ఉదయం నుంచి ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు… సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రయ్ కంపెనీ 300 కోట్లు మేర బ్యాంకు రుణాలు తీసుకుంది…

అయితే వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం అందుతోంది… కాగా గతంలో ఆయన టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు…