కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు.

0
90

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు శరవేగంగా పుర్తపోయింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు కానున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం అమలు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సక్రమంగా లేదని భాజపా నేత జీవీఎల్‌ నరసింహారావు  తీవ్రంగా విమర్శించారు.

ఈ సందర్బంగా జిల్లాల విభజన ప్రక్రియపై మీడియా సమావేశంలో జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడారు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రతిపదికగా కొత్త జిల్లాల విభజన ప్రక్రియ జరగాలని మేనిఫెస్టోలో పొందుపరిచిన పార్టీ భాజపాయే అని ఆయన మండిపడ్డారు.

అయితే కొత్త జిల్లాల విభజన నిర్ణయం సరైందే అయినా అమలు చేసే పద్ధతి శాస్త్రీయంగా లేదని ఆయన తెలిపారు. సరైన వసతులు లేకుండా విభజన చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.