హనుమాన్ చాలీసా వివాదం..జైలు నుండి విడుదల కావాలని కుమార్తె ఘనంగా పూజలు..

0
109

సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని నవనీత్ కౌర్ రాణా,తన భర్త ఎమ్మెల్యే రవి గురువారం ప్రకటించడంతో వారు చిక్కుల్లో ఇరుకున్నారు. మ‌త‌ప‌ర‌మైన భావాల‌ను రెచ్చ‌గొట్టారంటూ శివ‌సేన నేత‌లు హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దాంతో నవనీత్ కౌర్ రాణా,తన భర్త ఎమ్మెల్యే రవిని శివ‌సేన నేత‌లు ఆరోపణ మేరకు శనివారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు..వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. అనంతరం ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టగా..బాంద్రాలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రెండు వారాలు  జుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

నవనీత్​ రాణా, ఎమ్మెల్యే రవి రాణాల కుమార్తె ఆరోహి రాణా బుధవారం ప్రత్యేక పూజలు చేసి పూజలు తమ తల్లిదండ్రులు త్వరగా విడుదల కావాలని దేవున్ని మనసారా వేడుకుంది. తన తల్లిదండ్రుల బ్యానర్​ పెద్దగా ఏర్పాటు చేసి అమరావతిలోని తమ స్వగృహంలో ఘనంగా తనతో పాటు  బంధువులు, సన్నిహితులు తో కూడా హనుమాన్ చాలీసా చదివించింది.