జగన్ గురించి ఫన్నీ రిప్లై ఇచ్చిన మంచు మనోజ్

జగన్ గురించి ఫన్నీ రిప్లై ఇచ్చిన మంచు మనోజ్

0
94

మంచు మనోజ్ ఎప్పుడూ సరదాగా ఉంటాడు.. అలాగే ట్విట్టర్ లో సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా హూషారుగా ఉంటాడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే టాలీవుడ్ నుంచి వెంటనే రియాక్ట్ అయ్యే హీరోల్లో మంచు మనోజ్ కూడా ఒకరు..తనను ఉద్దేశించి ట్వీట్ చేసిన ఓ నెటిజన్ తో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ఆసక్తికర సంభాషణ నడిపారు.

సీఎం జగన్ ను మంచు కుటుంబ సభ్యులు తలో రకంగా సంబోధిస్తుండడం పట్ల చికాగో సుబ్బారావు అనే నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నువ్వేమో బావా అంటావ్, మీ అన్నయ్యేమో అన్నా అంటాడు… ఏదో ఒకటి స్పష్టంగా చెప్పు బ్రో అంటూ మంచు మనోజ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

దీనికి మనోజ్ ఫన్నీగా స్పందించాడు. సదరు నెటిజన్ పేరును దృష్టిలో ఉంచుకుని, నువ్వు చికాగో అంటావ్, మళ్లీ సుబ్బారావు అంటావ్… నువ్వు క్లారిటీ ఇవ్వు బ్రో అంటూ బదులిచ్చాడు. దీంతో అందరూ దీనిపై తెగ నవ్వులూ స్మైల్ కాజ్ లు పెడుతున్నారు, మొత్తానికి సినిమాలో మంచు మనోజ్ చేసే కామెడీ ఎలా ఉంటుందో తెలిసిందే.. నలుగురితో చాలా సరదగా ఉంటాడు అతనికి కూడా అలాగే ఫన్నీగా కామెంట్ రిప్లైగా ఇచ్చాడు అంటున్నారు, నిజమే జగన్ బాబాయ్ కూతురిని మంచు విష్ణు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.