ఇటీవల కొందరు దొంగలు దర్జాగా వచ్చి దొంగతనాలు చేస్తున్నారు.. ఇది కూడా ఇలాంటిదే కానీ టెక్నాలజీ
సాయంతో వారిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు, పంజాబ్లోని ఫిరోజ్సిటీకి చెందిన సమర్జ్యోతిసింగ్, కేరళలో కేసరగుడ్ జిల్లాకు చెందిన జాఫర్ సాదిక్ లు బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న వీరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. అక్కడ నుంచి దొంగతనాలు చేయడానికి ప్లాన్ వేసుకున్నారు.
ఇటీవల నగరానికి వీరు విమానంలోవచ్చారు, నేరుగా హోటల్ లో రూమ్ తీసుకున్నారు, ఓ ఏటీఎంని ఎంచుకుని అందులో నగదు దోచేయాలి అని ప్లాన్ చేశారు,అవసరమైన గ్యాస్ కట్టర్, సిలిండర్, తదితర వస్తువులను తీసుకొని ముందే ఏటీఎం ఎదురు పార్కులో దాచారు.
రెంట్ బైక్ తీసుకుని దోపిడీకి పాల్పడ్డారు, ఏకంగా రూ.9,59,500 చోరీ చేశారు. తర్వాత ఇద్దరూ హోటల్కు చేరుకున్నారు.మరుసటిరోజు ఉదయం స్కూటీని రెంటల్ షాపులో పెట్టి నేరుగా విమానాశ్రయానికి చేరుకుని పది గంటలకు బెంగళూరు వెళ్లిపోయారు. ఇక సీసీ కెమెరాలు అన్నీ పరిశీలిస్తే వీరి బండారం మొత్తం బయటపడింది, వీరిని పోలీసులు అక్కడ అదుపులోకి తీసుకున్నారు.