రేవంత్ రెడ్డికి హైకోర్టు బిగ్ షాక్

High Court Big Shock to Revanth Reddy

0
107

టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్, మల్కజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. 50 లక్షల రూపాయలను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇస్తూ ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
అయితే ఈ కేసు అసలు ఎసిబి పరిధిలోకి రాదని, దాన్ని కొట్టేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని, ఎసిబికి సంబంధం లేదని రేవంత్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో ఇదే విషయమై ఎసిబి కోర్టులోనూ రేవంత్ రెడ్డి పిటిషన్ ఫైల్ చేయగా ఎసిబి కోర్టు సైతం పిటిషన్ ను కొట్టేసింది. తాజాగా హైకోర్టు కూడా కొట్టేసింది.