బాలయ్యకే జై కొడుతున్న హిందూపురం ప్రజలు

బాలయ్యకే జై కొడుతున్న హిందూపురం ప్రజలు

0
116

హిందూపురంలో తెలుగుదేశం పార్టీ మంచి జోష్ లో ఉంది. పార్టీ తరపున నిలబడిన బాలయ్యకు గెలుపు పక్కా అంటున్నారు ఇక్కడ తెలుగుదేశం నేతలు. ముఖ్యంగా టీడీపీ వేవ్స్ ఇక్కడ బలంగా కనిపిస్తున్నాయి. ప్రచారంలో కూడా బాలయ్యకు పెద్ద ఎత్తున మద్దతు కూడా ఇచ్చారు ప్రజలు. ఇక ప్రజలే కాదు ఎన్నికల అధికారులు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు..హిందూపురంలో ఎన్నికల కేంద్రం వద్ద కోలాహలం నెలకొంది. రేపు (గురువారం) జరగబోయే పోలింగ్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడంలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు.

ఎన్నికల విధులు నిర్వహించేందుకు అధికారులు పోలింగ్ బూత్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రవాణా సౌకర్యంతోపాటు భద్రత చర్యలు కూడా తీసుకుంటున్నారు. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 32 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ తాహసీల్దార్ మోయినుద్దీన్ తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్కు సంబంధించి వేర్వేరు రూమ్లను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.