జగన్ కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన ఆదినారాయణ రెడ్డి

జగన్ కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన ఆదినారాయణ రెడ్డి

0
92

కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గతంలో కంటే ఫుంజుకుంది అని, ఇక్కడ వైసీపీ నేతలు చెప్పడం కాని డవలప్ మెంట్ చేసేది ఏమీ లేదు అని విమర్శించారు మంత్రి ఆదినారాయణ రెడ్డి.. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. జగన్ కు డవలప్ మెంట్ పై ఫోకస్ చేయడం తెలియదు అని, సంక్షేమపథకాలు ఎన్నో తెలుగుదేశం ప్రవేశపెట్టింది అని జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం తీసుకువస్తామని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జిల్లా ప్రజలు లబ్ధి పొందారని అన్నారు.

మంగళవారం ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆదినారాయణ రెడ్డి.. ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఫ్యాక్షన్ లేని ఫ్యాషన్ జిల్లాగా కడపను అభివృద్ధి చేస్తామన్నారు. కడప ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. రౌడీయిజంతో జగన్ చెలరేగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్ కు ఇక్కడ గెలిచే సీన్ లేదు అని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పులివెందులలో కూడా గెలుస్తుంది అని ప్రచారం మినహా ఏమీ వైసీపీ చేసేది లేదు అని ఆయన విమర్శించారు.