చరిత్రలో నిలిచిపోయేంతలా చికెన్ ధర…. ఎంత అంటే…

చరిత్రలో నిలిచిపోయేంతలా చికెన్ ధర.... ఎంత అంటే...

0
38

కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా కోళ్ల పెంపకం తగ్గింది… దీంతో కిలో చికెన్ ధర ఆకాశాన్ని తాకింది… మూనుపెన్నడు లేని విధంగా చికెన్ రేటు పెరిగిపోయింది…రెండు నెలల క్రితం చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందని అందరు తినడం మానేశారు… దీంతో దారుణంగా ధరలు తగ్గాయి… కొంత మంది చికెన్ ఫ్రీగా తీసువెళ్లమని చెప్పారు…

అయితే ఎప్పుడైతే చికెన్ తినడం వల్ల కరోనా రాదని చెప్పారో ఇక అప్పటి నుంచి చికెన్ ధర 200 నుంచి 250కి చేరింది అయితే ఈ రేటు ఇప్పుడు 310కి పెరిగింది..బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇది రికార్డ్… ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా కిలో చికెన్ ధర్ 260… అదే రేటు ఇప్పటి వరకు రికార్డ్…

అయితే ఈ రికార్డ్ చెరిగి పోయింది…310 అనేది దేశంలోకెళ్ల అత్యధిక ధర కావడం రికార్డ్… కరోనా కారణంగా పెద్దా, చిన్నా, హోటల్లు, బార్లు, రెస్టారెంట్లు, రోడ్డుపక్కన దుకాణాలు ముత పడ్డాయి అవికూడా తెరుచుకుంటే ఇక చికెన్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు..