కోలా డ్రింక్ చరిత్ర అసలు ఎలా మార్కెట్లోకి వచ్చిందంటే

-

పెంబెర్టన్ తయారు చేసిన కోలా రెసిపీ చాలా మంది కొనుగోలు చేయాలి అని భావించారు, అయితే 1888లో అసా గ్రిగ్స్ కాండ్లర్ అనే వ్యాపారవేత్త కోకాకోలా రెసిపీని కొనుగోలు చేశాడు. అప్పట్లోనే 2,300డాలర్లకు పెట్టి కొన్నాడని చరిత్రకారులు భావిస్తున్నారు. కాండ్లర్ 1892లో ‘కోకా-కోలా కంపెనీ’ స్థాపించాడు. 1895నాటికి అమెరికా వ్యాప్తంగా ఈ కూల్డ్రింక్ వ్యాపారాన్ని విస్తరించాడు.

- Advertisement -

1899లో ఈ కంపెనీ కోకాకోలాను విదేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. ఇది తాగితే పలు సమస్యలు దూరం అవుతాయి అని ప్రచారం కూడా జరిగింది, దీనికి విపరీతమైన డిమాండ్ వచ్చింది, 1915లో కోకాకోలా కోసం రూట్ గ్లాస్ కో అనే సంస్థ ఐకానిక్ కోకాకోలా బాటిల్ను రూపొందించింది.

ఆ సమయంలో కోకాకోలా కూల్డ్రింక్స్ అమ్మకాలు విపరీతంగా జరిగేవి. 1917లో కూల్డ్రింక్ రెసిపీలోని కఫైన్ను 50శాతం తగ్గించేసి అందరూ అన్ని వేళలా తాగే విధంగా సాధారణ శీతల పానీయంగా తయారు చేయించాడు కాండ్లర్. అతడి తర్వాత కోకాకోలా సంస్థ బాధ్యతలు వారి వారసులు స్వీకరించారు.

ప్రస్తుతం కోకాకోలా 200కుపైగా దేశాల్లో 500 రకాల బ్రాండ్ల పేర్లతో, 4,700 రకాల రుచులతో వినియోగదారులను ఆకట్టుకుంటుంటోంది… ఏడు లక్షలమందికిపైగా ఉపాధి కల్పిస్తోంది. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తుంటే లక్షలాది మంది చిరు వ్యాపారులు దీనిపై బతుకుతున్నారు అమ్మకాలతో.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్: రేవంత్

తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్...

Annamayya District | గూండాల కోనలో గజేంద్రల బీభత్సం.. ముగ్గురు మృతి

Annamayya District | అన్నమయ్య జిల్లాలోని గూండాలకోన దగ్గర గజరాజులు బీభత్సం...