తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు భారీగా పెరుగుతున్నాయి, దీంతో చాలా మంది హైదరాబాద్ లో నివసించే ఏపీ వారు ఏపికి వెళ్లిపోవడం బెటర్ అని ఆలోచన చేస్తున్నారు, అందుకే ఏపీకి పయనం అవుతున్నారు,ఈ మధ్యే హైదరాబాద్ వచ్చిన వారు కూడా తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లాలి అని అనుకుంటున్నారు.
ఏపీ ప్రభుత్వం ఎవరు వచ్చినా కచ్చితంగా ఈ పాస్ ఉండాలి అని చెబుతోంది, దీంతో ఈ పాస్ అప్లై చేసుకుని మాత్రమే వస్తున్నారు, తాజాగా చాలా మంది ఇలాగే ఈ పాస్ తో వచ్చేస్తున్నారు, అయితే సుమారు గతంలో రోజుకి 300 నుంచి 400 వెహికల్స్ వస్తే దాదాపు ఇప్పుడు 800 నుంచి 1000 వెహికల్స్ వస్తున్నాయట. అంటే దాదాపు ఇలా 1000 మంది ఈ పాస్ అప్లై చేసుకున్న వారు వస్తున్నారు.
ఇప్పుడు లాక్ డౌన్ వార్తలు రావడంతో రోజుకి 800 నుంచి 1000 మంది ఈపాస్ తో అప్లై చేసుకుని వస్తున్నారు అని చెబుతున్నారు, ఇక ఈ పాస్ లేకుండా మరో 500 వెహికల్స్ వస్తున్నాయని వాటిని వెనక్కి పంపేస్తున్నాము అంటున్నారు అధికారులు.