తెలంగాణలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, దీంతో తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించింది, ఇక ఎవరైనా సరే రాత్రి 9 తర్వాత తిరగడానికి లేదు దీనిపై కఠిన ఆంక్షలు ఉంటాయి, అత్యవసర వైద్య సదుపాయాలు ట్రావెల్ చేసేవారు వెళ్లవచ్చు. అంతేకాని రోడ్లపై ఇష్టం వచ్చినట్లు తిరగడానికి లేదు, స్టేట్ అంతా ఈ రూల్స్ ఉంటాయి.
అయితే హైదరాబాద్ లో మరి ఈ రూల్స్ ఏమిటి అంటే ఓసారి చూద్దాం,
మీడియా, పెట్రోల్ బంక్లకు మినహయింపు ఉంది
నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులకు రాత్రి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది
అత్యవసర సేవలు, అంబులెన్స్ డాక్టర్లు నర్సులు సర్వీస్ వారు వెళ్లవచ్చు
మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆస్పత్రులు, ప్రయివేటు సెక్యూరిటీ సర్వీసులు, ఉంటాయి
ఈ-కామర్స్ సేవలు, ఆహార పదార్థాల పంపిణీ, కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్లకు మినహాయింపు ఇచ్చారు.
ఇక అందరికి డౌట్ మరి విమాన రైలు బస్సు ప్రయాణికులకు ఏమిటి అని.. అయితే వీరు కచ్చితంగా టికెట్ కారీ చేయాల్సిందే, ఈ సమయంలో చెకింగ్ చేసేటప్పుడు టికెట్ చూపించాలి లేకపోతే పర్మిషన్ ఇవ్వరు.. వైద్యం కోసం వెళ్లే గర్భిణులు, రోగులకు కూడా మినహాయింపు ఇచ్చారు. ఇక ఏ స్టేట్ కు వెళ్లాలి అన్నా రావాలి అన్నా ఎలాంటి ఈ పాస్ తీసుకో అక్కర్లేదు.
ఇక థియేటర్లు పబ్బులు క్లబ్ లు బార్లు రెస్టారెంట్లు ఉండవు మద్యం షాపులు కూడా రాత్రి 8 కి బంద్ , రోడ్లపై రాత్రి 9 తర్వాత తిరగడానికి లేదు.