రేవంత్ పై జగ్గారెడ్డి ఫైర్..“ముత్యాల ముగ్గు” సినిమాలో హీరోయిన్ పరిస్థితి నాది అంటూ..

0
87

పీసీసీ బాధ్యతల నుంచి తనను అధిష్ఠానం తప్పించడంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనకు ఝలక్ ఇవ్వడం కాదని.. తానే ఆయనకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలు తనకు రేవంత్‌రెడ్డికి మధ్య మాత్రమేనని కాంగ్రెస్‌కు సంబంధంలేదని ఆయన వివరణ ఇచ్చారు.

అన్ని వివాదాలకు రేవంత్ రెడ్డినే కారణం. ఆయన నిజ స్వరూపం ఎవరికీ తెలియదు. నాకు కాంగ్రెస్ ను వీడాలని లేదు. ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్ టైపు తన పరిస్థితి అయిందని.. నేను హీరోయిన్.. హీరో కాంగ్రెస్ పార్టీ  విలన్ రేవంత్ రెడ్డీ అంటూ ఫైర్‌ అయ్యారు.

తనతో రేవంత్ వ్యవహరించిన తీరు సరైందేనా? జగ్గారెడ్డికే ఇలా జరిగితే.. మిగిలిన వాళ్లకు ఏం చేస్తారని ఫైర్‌ అయ్యారు. ఎవరికి టికెట్ ఇస్తారు..ఏమౌతుందని అనుమానంగా ఉందని.. ఇప్పుడు నాకు శీల పరీక్ష అంటూ వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.  కాంగ్రెస్ లో ఉన్న మజా ఇంకో పార్టీలో ఉండదని.. రేవంత్ పై బురద జల్లే అవసరం తనకు లేదన్నారు.