తెలంగాణపై మోదీ విషం కక్కుతుంటే..కేసీఆర్ ఎక్కడ? రేవంత్ రెడ్డి

If Modi is poisoning Telangana..where is KCR? Rewanth Reddy

0
97

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని అన్నారు. నేను తెలంగాకు వ్యతిరేఖం కాదని.. అయితే విభజనకు అనుసరించిన పద్దతి సరైందిగా లేదని ఆయన అన్నారు. తెలంగాణ- ఏపీల మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని ఫైర్ అయ్యారు.

ప్రధాని వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ ప్రజా ఉద్యమాల ద్వారా ఎదగలేదని అరుణ్‌జైట్లీని మెనేజ్‌ చేసి పదవులు దక్కించుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. ప్రధాని మోదీకి పార్లమెంటు సంప్రదాయాలు కూడా తెలియవని మండిపడ్డారు.

తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి వాజ్‌పేయి మోసం చేశారు. ఎన్డీఏ తొలి ప్రభుత్వమే తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే వందలమంది ప్రాణాలు పోయేవి కావు. కీలక బిల్లుపై ఓటింగ్‌ జరిగేటప్పుడు తలుపులు పెట్టడం ఎప్పుడూ జరిగేదే. బిల్లుపై చర్చ అవసరం లేదు, వెంటనే ఆమోదించండి అని సుష్మాస్వరాజ్‌ అన్నారు. ఇవన్నీ తెలియకుండా మోదీ ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు.

తెలంగాణపై మోదీ విషం కక్కుతుంటే ప్రశ్నించని సీఎం కేసీఆర్ ఎక్కడ అని రేవంత్ నిలదీశారు. పార్లమెంట్ లో మోడీ ఎంత మాట్లాడుతున్న టిఆర్ఎస్ ఎంపీలు ఒక్కరు నోరు మెదపలేదన్నారు. కనీసం నిరసన తెలపడానికి కూడా ముందుకు రాలేదు. బీజేపీ, టిఆర్ఎస్ ఒక్కటే  రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయి. తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు రేవంత్.