చైనాకు ఇండియా షాక్..మరో 54 యాప్స్ బ్యాన్

India shock to China..an 54 more apps banned

0
110

చైనాకు మరోసారి భారీ షాక్ ఇచ్చింది భారత్. ఇప్పటికే చైనాకు చెందిన పలు యాప్స్ ను బ్యాన్ చేసిన ఇండియా తాజాగా మరో 54 యాప్స్ ని బ్యాన్ చేస్తూ ఝలక్ ఇచ్చింది. దేశ రక్షలకు ఇబ్బందికరంగా మారడంతో ఈ యాప్స్ పై బ్యాన్ విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వీటిలో బ్యూటీ కెమెరాతో పాటు స్వీట్ సెల్ఫీ హెచ్‌డి, బ్యూటీ కెమెరా – సెల్ఫీ కెమెరా, ఈక్వలైజర్ & బాస్ బూస్టర్, సేల్స్‌ఫోర్స్ ఎంట్ కోసం క్యామ్‌కార్డ్, ఐసోలాండ్ 2: యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, ఒమియోజీ అరేనా, ఆప్యోజీ చెస్, డ్యూయల్ స్పేస్ లైట్ యాప్స్ ఉన్నాయి.

దేశ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పును దృష్టిలో ఉంచుకుని గత ఏడాది జూన్‌లో, టిక్‌టాక్, వీచాట్ మరియు హెలో వంటి విస్తృతంగా ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహా 59 చైనీస్ మొబైల్ అప్లికేషన్‌లను భారతదేశం నిషేధించింది. సెప్టెంబరులో మరో 118 చైనీస్ మొబైల్ యాప్‌లను బ్లాక్ చేసింది. 2020 నుంచి  ఇప్పటి వరకు ఇండియా 224 చైనీస్ యాప్స్ ని బ్యాన్ చేసింది.