ఇండియా టుడే సర్వే చూస్తే మతిపోతుంది

ఇండియా టుడే సర్వే చూస్తే మతిపోతుంది

0
102

దేశంలో క్రెడిబులిటీ ఉన్న సర్వే సంస్ధలు మీడియాలు సర్వేలు చేస్తే వాటిని ఎవరైనా నమ్ముతారు.. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్దితి కనిపిస్తోంది. కొన్ని మీడియా సంస్ధలు చేసే సర్వేలు చాలా పాజిటీవ్ గా కొన్ని పార్టీలకు వస్తాయి, అవి వారి మీడియా సంస్ధలు అని తెలిసిపోతాయి. ఇక కొన్ని మాత్రం వాస్తవాలు మాత్రమే చెబుతాయి. ఇండియా టుడే అంచనాలు మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో నిజమయ్యాయి. అక్కడ టీఆర్ఎస్ 80కు పైగా సీట్లు వస్తాయని వేసిన అంచనా అక్షరాల వాస్తవమైంది. ఇక జాతీయ చానెళ్లలో స్వతంత్రంగా వార్తలు ఇవ్వడంలో మంచి క్రెడిబులిటీ ఇండియా టుడేకు ఉంది. అందుకే ఆ సంస్ధ ఎలాంటి సర్వే ఇచ్చినా జనాలు నమ్ముతారు, ఇప్పుడు ఏపీలో కూడా ఈ సర్వే సంస్ధ ఇచ్చిన సర్వే పై చర్చ జరుగుతోంది.

రాజ్ దీప్ సర్దేశాయ్ ఎక్జిక్యూటివ్ ఎడిటర్ గా దీన్ని నడిపిస్తున్నారు అనేది తెలిసిందే. ఇండియా టుడే కూడా ఇటీవల విడుదల చేసిన సర్వేలో కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది దీనిపై వైసీపీ ఆశలు కూడా పెట్టుకుంది తమ సర్వేకు ఈ సర్వే దగ్గరగా ఉంది అని కూడా భావించారు నేతలు .విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, నరసరావుపేట, హిందూపూర్, రాజంపేట, కర్నూలు, నంద్యాల, బాపట్ల, ఏలూరు, అరకు, ఒంగోలు, నర్సాపురం, కడప, నెల్లూరు, తిరుపతి లోక్ సభ సీట్లను వైసీపీ గెలుస్తుందని ఇండియా టుడే సర్వేలో పేర్కొంది. ఇక 6 చోట్ల టీడీపీ-వైసీపీ మధ్య టఫ్ ఫైట్ ఉందని తెలిపింది. దీంతో తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది, ఇంత క్రెడిబులిటీ ఉన్న సంస్ధ ఇలాంటి రిజల్ట్ ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు.

చిత్తూరు, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, అనంతపురం, శ్రీకాకుళంలలో టీడీపీ, వైసీపీ మధ్య హోరా హోరీ పోటీ ఉంటుందని ఇండియా టుడే అంచనావేసింది. ఇక సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీచేసిన విశాఖ ఎంపీ సీట్లో మాత్రం జనసేన పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే అంచనా వేసింది. 18 వైసీపీ 6 టీడీపీ 1 జనసేన ఎంపీ స్ధానాలు గెలిచే అవకాశం ఉంది అని తేల్చింది ఆ సర్వే సంస్ధ.