చంద్రబాబు వద్దకు క్యూ కడుతున్న నేతలు

చంద్రబాబు వద్దకు క్యూ కడుతున్న నేతలు

0
66

ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పారు అనే చెప్పాలి.. సీఎంగా ఆయన ఏపీకి మరోసారి ప్రమాణస్వీకారం చేయడం పక్కా అని సర్వేలు అన్నీ చెబుతున్నాయి.. ఇక ఏపీలో ఈసారి జగన్ మళ్లీ ఆశలు పెట్టుకోవడం మినహా సాధించేది పురోగతి ఏమీ లేదు అని చెబుతున్నారు. ఇక కేంద్రంలో యూపీఏకు మెజార్టీ పక్షాల నుంచి మద్దతు రావడం, దాని వెనుక చంద్రబాబు చక్రం తిప్పడంతో కేంద్రంలో ఉన్న ఎన్డీయేకు చెమటలు పడుతున్నాయి… బీజేపీ నేతలు షాక్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్న చంద్రబాబుకు ఈసారి పాజిటీవ్ రిజల్ట్ వచ్చేలా కనిపిస్తోంది.

మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం కుమారస్వామిని ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ నెల 23న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అదే రోజు న్యూఢిల్లీలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు. దీనిపై వారి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. కేంద్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీక మెజార్టీ రావాలి అని చూస్తున్నారు, అలాగే తటస్ధ పార్టీలను సైతం ఏకం చేసే ఆలోచనలో ఉన్నారు బాబు, ఇక ఏపీలో జగన్ పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక ఫలితాల రోజు ఆశలు అన్నీఅడియాశలు అవుతాయి అని చెబుతున్నారు నేతలు. ఇక కచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కేవలం నెలలోనే సాధిస్తారు అలాగే కేంద్రంలో మంత్రి పదవులు కూడా సాధిస్తారు అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.