Flash: ఏపీలో ఇంటర్‌నెట్ సేవలు, బస్సులు బంద్..కారణం ఏంటో తెలుసా?

0
143
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో అమలాపురం మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొనసీమ జిల్లాకు అంబేద్కర్‌ జిల్లాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ యువకులు నిరసనలు చేస్తూ ఆందోళనకారులు కలెక్టర్‌ కార్యాలయంలోకి దూసుకొస్తుండగా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. అనంతరం పోలీసులు  తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత  కొంత అదుపులోనికి తెచ్చారు.
ఈ ఘటన జరుగుతున్న క్రమంలో  కరెంట్ కట్ చేయడంతో చీకట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నేడు కలెక్టరేట్‌ ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ అల్లర్లు, విధ్వంస ఘటన కారణంగా అమలాపురంలో ఇంటర్‌నెట్‌ సేవలను బంద్‌ చేయడంతో పాటు..ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు. కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమకు బస్సు సర్వీసులను కూడా కూడా రద్దు చేయడం జరిగింది. ఈ ఘటన కారణంగా సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.