సిద్ధాంతాపరమైన పార్టీ అని చెప్పుకొనే బీజేపీ… ఆరోపణలతో భర్త రఫ్ అయిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని మాజీ మంత్రి, ప్రస్తుత బిజెపి నేత ఇనగాల పెద్దిరెడ్డి పార్టీ అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
టీఆర్ ఎస్ పార్టీలోకి తనను ఎవరూ ఆహ్వానించలేదని తేల్చి చెప్పారు పెద్దిరెడ్డి. హుజూరాబాద్ లో ఉపఎన్నిక వస్తే తాను కచ్చితంగా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ లోకి వస్తున్న అంశంపై పార్టీ నేతలు ఎవరూ తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశానని గుర్తు చేశారు. తానేంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు పెద్దిరెడ్డి.
ఆత్మాభిమానం చంపుకొని పార్టీ లో ఉండాల్సిన అవసరం ఏ నేతకు ఉండదని ఘాటుగా మాట్లాడారు.
మొత్తానికి ఇనగాల పెద్దిరెడ్డి వాలకం చూస్తుంటే ఈటల రాజేందర్ బిజెపిలో చేరిన మరుక్షణమే ఆయన బిజెపికి గుడ్ బై చెప్పేలా ఉన్నారు. ఇద్దరు నేతలు హుజూరాబాద్ నియోజకవర్గంపై ఫోకస్ చేసిన వారే కావడంతో ఒక ఒరలో రెండు కత్తులు ఇమిడే చాన్స్ లేదని తెలుస్తోంది.