నోటీసులపై హైకోర్టుకు ఈటల భార్య జమునారెడ్డి | Etela Jamuna Reddy Approached High Court

0
41

 

మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మాసాయిపేట భూముల సర్వే గురించి ఈనెల 5వ తేదీన తెలంగాణ సర్కారు ఇచ్చిన నోటీసులపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
జమునారెడ్డి తరుపున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే అసైన్డ్ భూముల లెక్క తేల్చేందుకే నోటీసులు జారీ చేసినట్లు అడ్వొకెట్ జనరల్ వాదించారు. భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో తేల్చేందుకు నోటీసులు ఇస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన జమున అడ్వొకెట్ దేశాయ్ ప్రకాశ్ రెడ్డి… సరైన కారణాలు లేకుండానే నోటీసులు జారీ చేశారని వాదించారు.

ఈటల రాజేందర్ బర్తరఫ్ చేయడానికి ప్రధాన కారణమైన భూకబ్జా ఆరోపణలను నిరూపించేందుకు తెలంగాణ సర్కారు ఆచితూచి ముందుకు సాగుతున్నది. స్టెప్ బై స్టెప్ విచారణను శాఖల వారీగా చేపడుతున్నది. ఇప్పటి వరకు రెవెన్యూ, విజిలెన్స్, ఎసిబి అధికారులు విచారణ జరిపారు. జమున హేచరీస్ యాజమాన్యంపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వెంటనే మెరుపు వేగంతో విచారణ జరిపారు. కానీ ఇప్పుడు ఆ స్పీడ్ కు బ్రేకులు పడ్డట్లు తెలుస్తోంది.