ఇరాన్ లో 52 ప్లేస్ లు టార్గెట్ పెట్టిన అమెరికా , స్విచ్ ఆన్ చేస్తే బూడిదే ఎక్కడంటే

ఇరాన్ లో 52 ప్లేస్ లు టార్గెట్ పెట్టిన అమెరికా , స్విచ్ ఆన్ చేస్తే బూడిదే ఎక్కడంటే

0
112

అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది.. మీరు రెచ్చిపోయి మాపై పౌరులపై కార్యాలయాలపై మళ్లీ దాడులకు తెగబడితే ఇరాన్పై కనీవినీ ఎరుగని రీతిలో దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.. అమెరికాకు అంత దమ్ము లేదని ఇరాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం బదులిచ్చారు.

ఇరాన్ ఎంపీ ఒకరు ఏకంగా శ్వేతసౌధంపైనే దాడి చేస్తామని హెచ్చరించడంతో ఇప్పుడు ట్రంప్ సీరియస్ అయ్యారు ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఎలాంటి దాడులకు పాల్పడినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇరాన్లోని 52 కీలక ప్రాంతాలను గుర్తించాం. అని చెప్పారు
వాటిలో కొన్ని ఇరాన్కు, ఆ దేశ సంస్కృతికి అత్యంత ప్రధానమైనవి కూడా ఉన్నాయి. మీరు రెచ్చిపోకండని ట్రంప్ తెలియచేశారు,

ఇలా 52 లక్ష్యాలపై దాడులు తప్పవు అని హెచ్చరించడం పై ఇరాన్ కూడా ట్రంప్ పై విరుచుకుపడుతోంది. బెదిరించినా తాము బెదరము అని చెబుతోంది, మేము తీవ్రంగా బదులు ఇస్తాము అని హెచ్చరిస్తోంది.. చాలా ఏళ్ల కిందట ఇరాన్ 52 మంది అమెరికన్లను నిర్బంధించిన విషయాన్ని గుర్తుచేస్తూ ట్రంప్ 52 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. సైనిక సంపత్తి కోసం రెండు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేశాం. ఈ విషయంలో మేం ప్రపంచంలోనే అతి పెద్దగా, అత్యుత్తమంగా ఉన్నాం అన్నారు. అయితే ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ కాస్త శాంతియుతంగా ఉండాలి అని స్నేహ సంబంధాలు కలిగి ఉన్న దేశాలు చెబుతున్నాయి.