ఆఖరి క్షణంలో విక్రమ్ నుంచి ఆగిపోయిన సంకేతాలు

ఆఖరి క్షణంలో విక్రమ్ నుంచి ఆగిపోయిన సంకేతాలు

0
99

ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చంద్రాయన్ 2 లో టార్గెట్ కు ఒక్క నిమిషం ప్రయాణ దూరంలో సాంకేతిక సమస్యతో విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. మరో నిమిషం అయితే చంద్రుడిపై దిగుతుంది అనగా అకస్మాత్తుగా సిగ్నల్స్ రాకపోవడంతో సైంటిస్టులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఆఖరి 15 నిమిషాల్లో 14 నిమిషాలు విజయవంతంగా పూర్తవడంతో ఆనందం వెల్లివిరిసింది మరో నిమిషంలో విక్రమ్ జాబిల్లి ఒడిలోకి చేరుతుంది.

అనగా సిగ్నల్స్ నిలిచిపోయాయి. అర్థ అర్ధ రాత్రి 1:38 గంటలకు మొదలైన ల్యాండింగ్ ప్రక్రియ గంటకి 60 వేల కిలోమీటర్ల వేగంతో చంద్రుడిపైకి దూసుకెళ్తున్న విక్ర మ్ వేగాన్ని తొలుత విజయవంతంగా తగ్గించారు. తరువాత రఫ్ బ్రేకింగ్ దశ, పది నిమిషాల వ్యవధిలోనే ఫైన్ బ్రేకింగ్ దశ కూడా సక్సెస్ అయింది. జాబిలికి విక్రమ్ కి 2.1 కిలోమీటర్ల దూరం ఉందనగా ఈ సమస్య మొదలైంది.

దీంతో బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రి ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. తిరిగి సంకేతాల కోసం కాసేపు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో ఇస్రో చైర్మన్ కే. శివన్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయని, సంబంధిత డేటాని పరిశీలిస్తున్నామని ప్రకటించారు.