మనం ఏ వాహనం కొనుగోలు చేసినా కచ్చితంగా దేవాలయానికి తీసుకువెళ్లి పూజలు చేస్తాం, కొత్త వాహనానికి పూజ చేసిన తర్వాతే ఏదైనా ట్రిప్ వేస్తారు చాలా మంది, అంతేకాదు కొత్త వ్యాపారం కోసం వాహనం కొంటే అక్కడ నిమ్మకాయ కట్టి గుమ్మడికాయ కొట్టి ముందుకు తీసుకువెళతారు.
అయితే ఇక్కడ పండితులు కొన్ని విషయాలు చెబుతున్నారు, మీ మనసులో ఏ దేవుడిపై ప్రేమ ఉన్నా ఆ దేవాలయాల్లో పూజ చేయించుకోండి, అయితే వ్యాపారం కోసం కొనే వాహనాల విషయంలో అమ్మవారి గుడిలో పూజలు చేయించమని చెబుతున్నారు, దుర్గాదేవి పార్వతి దేవి గుడిలో అమ్మవార్లకు పూజలు చేయిస్తే ఆ పనిలో విజయం ఉంటుంది.
ఇక సొంతంగా బైక్ కారులు ఇంటి వినియోగానికి కొన్నవి కూడా వీలైతే అమ్మవారి గుడిలో ఎక్కడ అయినా పర్వాలేదు, లేదా హనుమంతుడి ఆలయంలో పూజ చేయించి ప్రారంభిస్తే అంతా విజయం వరిస్తుంది. కొత్త వాహనాలు పూజలు చేసే సమయంలో ఎరుపు దుస్తులు నలుపు దుస్తులతో వెళ్లవద్దు అని చెబుతున్నారు పండితులు.