ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వైసీపీ నేతపై సంచలన ట్వీట్

ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వైసీపీ నేతపై సంచలన ట్వీట్

0
93

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో జరిగిన ఐటీ దాడులు ఇప్పుడు రెండు రాష్ట్రాలని షేక్ చేస్తున్నాయి.. అలాగే ఇటు టీడీపీ వైసీపీ నేతల మధ్య విమర్శలకు కారణం అవుతున్నాయి.రెండు రాష్ట్రాల్లో రూ.2 వేల కోట్లకు పైగా అవకతవకలను గుర్తించామని ఐటీ శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. వివరణ ఇవ్వలేని రూ. 85 లక్షల నగదును, రూ. 71 లక్షల విలువైన నగలను సీజ్ చేశామని తెలిపింది. ఇది రాజకీయ పార్టీల ఆరోపణలకు ఆయుధంగా మారింది.

అయితే ఈ విషయంలో ఏపీలో మాత్రం రాజకీయ రగడ సాగుతోంది, చంద్రబాబు మాజీ పీఎస్ దగ్గర రూ. 2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. దీనికి కౌంటర్ గా, చదవడం వచ్చిన వారి దగ్గర ఐటీ ప్రెస్ నోట్ ను మరోసారి చదివించుకోండి అని సటైర్లు వేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కీలక కామెంట్ చేశారు ట్వీట్ ద్వారా…వైసీపీ నుంచి తనకు ఒకరు ఫోన్ చేశారని… ఐటీ దాడులపై మీరు ట్వీట్ చేయరా సార్ అని అడిగారని ఆయన చెప్పారు. తన ట్వీట్లు వైసీపీ, టీడీపీ అంచనాలకు అతీతంగా ఉంటాయని ఆయనకు తాను సమాధానమిచ్చానని తెలిపారు. అయితే దీనిని రాజకీయంగా ఇరు పార్టీలు వాడటం పై విశ్లేషకులు కూడా విమర్శలు చేస్తున్నారు.