నిర్భయ దోషులకి చిత్రహింసలట? మళ్లీ కోర్టుకి నిందితుడు ఏమి చెప్పాడంటే

నిర్భయ దోషులకి చిత్రహింసలట? మళ్లీ కోర్టుకి నిందితుడు ఏమి చెప్పాడంటే

0
31

నిర్భయ దోషుల ఉరిశిక్ష అనేది వాయిదాలమీద వాయిదాలు పడుతూనే ఉంది. జనవరి 22… ఫిబ్రవరి ఒకటి… వాయిదా ఇలా అనేక వాయిదాలు పడటంతో ఈ నిందితులు తప్పించుకునే మార్గాలు మరింత పెరుగుతున్నాయి. నిర్భయ దోషుల ఉరితీత గురించి అనేక సందేహాలు వస్తున్నాయి.

దేశంలో చట్టం ముందు అందరూ సమానమేనన్న ఉద్దేశంతో రాజ్యాంగం, చట్టం ప్రసాదించిన అవకాశాలను వినియోగించుకుంటూ దోషులు రోజుకో ఎత్తుగడతో వారు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు.. నలుగురు క్షమాబిక్ష అస్త్రం ప్రయోగించారు, తాజాగా మరో దోషి మరో ఎత్తుగడ వేశాడు.

నన్ను తీహార్ జైల్లో చిత్రహింసలు పెట్టారు. ఆ కారణంగా నాకు పిచ్చెక్కింది. మానసిక సమస్యతో నేను బాధపడుతున్నాను అంటూ తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్శర్మ నిన్న సుప్రీంకోర్టుకు తెలిపాడు. కాని అతను బాగానే ఉన్నాడని కావాలనే ఇలాంటి పద్దతి అవలంభిస్తున్నాడు అని కోర్టుకి కేంద్రం తెలిపింది.. వీరి ఆలోచన చూస్తుంటే ఇంకెన్ని ఎత్తుగడలు వేస్తారా అని అనుమానం వస్తోంది.