జగన్ కు ఆరునెలల పాలనలో అనుకూలమైన అంశాలు

జగన్ కు ఆరునెలల పాలనలో అనుకూలమైన అంశాలు

0
76

మే 30 న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.. అయితే ఆరునెలల కాలం ఇవ్వండి మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అని అక్కడే తెలియచేశారు. అయితే నవంబర్ 30తో జగన్ సీఎం అయి ఆరునెలలు పూర్తి అవుతోంది ..మరి జగన్ కుపాజిటీవ్ అంశాలు ఏమి అయ్యాయో చూద్దాం.

జగన్ ముందు పించన్ పెంపు అన్నారు, అయితే 250 పెంచి మరో నాలుగు సంవత్సరాలలో 1000 పెంచుతాం అన్నారు…ఇక సచివాలయ ఉద్యోగాలు, గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు, నాలుగు లక్షలు కల్పించారు. అలాగే సచివాలయాలు ఏర్పాటు చేశారు.

మద్యపాన నిషేదానికి తొలి అడుగు వేసి బార్లను వైన్ షాపులను తగ్గించి ప్రభుత్వం నడుపుతోంది, రివర్స్ టెండరింగ్ ద్వారా సుమారు వెయ్యా కోట్లు ఖజానాకి మిగిల్చారు..ఆరోగ్య శ్రీ, అమ్మ ఒడి, అగ్రిగోల్డ్ బాధితుల‌కు చెల్లింపులు, ఆటోవాలాల‌కు ఆర్థిక సాయం, మ‌త్య్సకార భరోసా, రైతు భ‌రోసా, నాయీ బ్రాహ్మణులకు హామీలు చేసుకుంటూ వచ్చారు .. తాజాగా కాపు మహిళలకు 15 వేల రూపాయలు ప్రతీ ఏడాది ఇవ్వనున్నారు.

స్కూళ్లకు మహర్ధశ తీసుకువస్తున్నారు, అమరావతిపై కమిటీ, రైతులకు భరోసా కల్పించారు. అలాగే అక్రమ కట్టడాల కూల్చివేత నిర్ణయం తీసుకున్నారు. అది ప్రజా వేదిక నుంచి మొదలు అయింది. వచ్చే ఏడాది ఉగాదికి 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనుంది సర్కారు, ఇది జగన్ ఆరునెలల్లో సాధించిన పురోగతి.