జగన్ కు ఆరునెలల పాలనలో ప్రతికూలమైన అంశాలు

జగన్ కు ఆరునెలల పాలనలో ప్రతికూలమైన అంశాలు )

0
106

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలోకి వచ్చి ముఖ్యమంత్రిగా అయి ఆరు నెలలు పూర్తి చేసుకుంది.. అయితే తాను ఆరునెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్నారు.. దీనిపై ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు .. మరి ఆయనకు అనుకూల అంశాలు చూశాం, మరి ప్రతికూల అంశాలు ఏమిటో తెలుసుకుందాం..

పించన్ల విషయంలో కొందరు 250 పెంచడం పై పెదవి విరిచారు.. టీడీపీ ఈ అంశాన్ని హైలెట్ చేసింది. కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం పై విమర్శలు వచ్చాయి, పలువురు టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం కూడా వైసీపీకి కాస్త మైనస్ అయింది.

ఇసుక కొరత ఆరు నెలల పాలనతో సుమారు 5 నెలలు దారుణమైన విమర్శలకు కారణం అయింది..
పీపీఏల రద్దు, అలాగే ప్రజలు విద్యార్దుల ఓపీనియన్ తెలుసుకోకుండా తెలుగు తీసివేసి పూర్తిగా ఇంగ్లీష్ మీడియం మాధ్యమం పెడతాను అని చెప్పడం. విమర్శల పాలైంది… జెరుసలేం పర్యటన కూడా విమర్శల పాలైంది.. తన ఇంటికి ప్రభుత్వ సొమ్ము కోట్లు వాడటం కూడా విమర్శల పాలైంది, ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్న జగన్, గెలిచాక దానిని మర్చిపోయారు, ఆరునెలల కాలంలో రాజధానిలో పనులు జరుగడం లేదు. పలు కంపెనీలు పెట్టుబుడులు పెట్టకుండా వెనక్కి పోవడం, అన్న క్యాంటీన్లు మూసివేత ఇవన్నీ ఆరునెలల కాలంలో వైసీపీకి మైనస్ అయ్యాయి.