రాజుగారితో సీఎం జగన్ భేటీ ఫైనల్ గా చెప్పనున్నారా

రాజుగారితో సీఎం జగన్ భేటీ ఫైనల్ గా చెప్పనున్నారా

0
79

వైసీపీ ఎంపీ ర‌ఘురామక‌ష్ణంరాజు.. ఈ పేరిప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో కాదు.. ఢిల్లీ రాజకీయాల్లో తెగ వినిపిస్తున్న పేరు..ప‌దిరోజులుగా ఆయ‌న పార్టీ మారుతారు అంటూ అనేక వార్త‌లు వినిపించాయి.. అయితే
ఆయన మాత్రం తాను పార్టీ మారడం లేదు అని క్లారిటీ ఇచ్చారు… కాని కొన్ని మీడియాలలో మాత్రం రాజుగారు కమలం పార్టీలో చేరుతున్నారు పాత పరిచయాల వల్ల ఆయన బీజేపీలో చేరుతారు అని వార్తలు వినిపించాయి.

ఇటీవల మంత్రుల పేషీల్లో, మంత్రుల నివాసాల్లోను ఆయన కనిపిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా చెప్పకుండా ఆయన బీజేపీ నేతలను కలుస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.మరో పక్క ఎంపీ రఘురామక‌ష్ణంరాజు ఈ భేటీలు తన వ్యక్తిగతమని చెబుతున్నారు.

అయితే, జగన్ హెచ్చరికను కూడా రఘురామక‌ష్ణంరాజు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఆయన ఏపీ కోసం ఇలా నేతలని కలుస్తున్నారా లేదా పార్టీ మార్పుకోసం ఇలా రాజకీయం చేస్తున్నారా అనేది మాత్రం పెద్ద చర్చ జరుగుతున్న అంశం. మరోసారి రాజుగారితో జగన్ భేటీ అవుతారు అని వార్తలు వస్తున్నాయి.