40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు ఎదురు అవుతున్నాయి… గతంలో ఎన్నడు ఎదురు కాని అనుభవాలు ఇప్పుడు ఎదురు అవుతున్నాయి… ఎప్పటినుంచో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న కీలక నేతలు సైతం ఇప్పుడు వైసీపీ గూటికి చేరుతున్నారు…
చంద్రబాబుకు సమకాలికుడైన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీని వీడటంపై ఇప్పటికీ పెద్ద చర్చ జరుగుతోంది…. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన బలరాం పార్టీ వీడటం పెద్ద దెబ్బే అని అంటున్నారు… ఇక ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పోతులు సునీత కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు… ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పోతుల సునీత 2014లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు…
ఆమె ఓటమి చెందినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు… అలాగే కదిరి బాబు రావు కూడా ఇటీవలే వైసీపీ తీర్ధం తీసుకున్నారు… ఈయన బాలకృష్ణ సన్నిహితుడు అవ్వడంతో చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు టికెట్ ఇచ్చారు… ఇక జిల్లాకు చెందిన మరో కీలక నేత సిద్దా రాఘవరావు…ఆయన కూడా పార్టీ వీడుతారని ప్రచారం జరుగుతోంది…
ఇలా ఒకే జిల్లాకు చెందిన వారందరు గతంలో టీడీపీతో లబ్దిపొందిన వారే ఇప్పుడు వీరందరు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపించడంతో కేడర్ అయోమయానికి గురి అవుతోంది…