వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున గెలిచిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఓ కీలక నేతకు మంత్రి పదవి ఇస్తారు అని సీనియర్లు చర్చించుకుంటున్నారు… ఇంతకీ ఎందుకు ఆయన మంత్రి పదవి ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనేగా మీ డౌట్ , జగన్ ఈసారి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదు అని భావిస్తున్నారట.. అందుకే అక్కడ తెలుగుదేశం వాయిస్ వినిపించకుండా చేసేందుకు ఓ కీలక నేతని రంగంలోకి దింపాలి అని చూస్తున్నారట.
అందుకే స్టేట్ లో ముఖ్యంగా కీలకమైన అసెంబ్లీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఎవరికి ఇవ్వాలి అని జగన్ ఆలోచిస్తున్నారట..ఈ పదవికి ఒకరిని ఫైనల్ చేశారు అని టాక్ నడుస్తోంది. ఇంటర్నల్ వర్గాల్లో ఎలాగో టీడీపీ ప్రతిపక్ష పార్టీ అవుతుంది, అందుకే ప్రతిపక్ష పార్టీని కట్టడి చేయాలంటే రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్కే సాధ్యమని జగన్ భావిస్తున్నారట, ఆయనని పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు ఈ పదవి ఇవ్వాలి అని చూస్తున్నారు జగన్ ..మరి నిజంగా ఆయన పార్టీలో చేరితే ఈసారి ఏపీలో కచ్చితంగా ఆయన రాజకీయం మరోసారి చూడవచ్చు అంటున్నారు.