వైసీపీలోకి ఇద్దరు జంపింగ్ కు రెడీ జగన్ నో సిగ్నల్

వైసీపీలోకి ఇద్దరు జంపింగ్ కు రెడీ జగన్ నో సిగ్నల్

0
43

వైసీపీలోకి వలసలు కొనసాగే సమయం ఆసన్నమైంది అంటున్నారు కొందరు నాయకులు .. ఎందుకు అంటే ఎన్నికల ముందు సీట్లు టిక్కెట్లు కోసం వైసీపీలోకి నేతలు జంప్ చేశారు.. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున సీట్లు టిక్కెట్లు సాధించి కూడా వైసీపీ పంచన చేరి అక్కడ నుంచి పోటీ చేశారు.. మరి ఇప్పుడు మరో వార్త ఇలాంటి సమయంలో వైరల్ అవుతోంది.. తాము గెలిచినా గెలవకపోయినా, వైసీపీలో చేరాలి అని భావిస్తున్నారట… గతంలో బాబు ఫిరాయింపులతో పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు, కాని ఇప్పుడు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఫలితాలు రాకుండానే పార్టీ మారి వైసీపీలో చేరాలి అని భావిస్తున్నారట.

అయితే ఈ విషయంలో మాత్రం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అని తెలుస్తోంది.. వారు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, గెలిచినా గెలవకపోయినా పార్టీలో చేరుతాము అని చెబుతున్నారట.. అయితే ఇప్పుడు వైసీపీలోకి చేరుతాము అని, ఫలితాలు రాకుండా వారు చెబుతున్నా, జగన్ మాత్రం ఆచితూచి ఆలోచిస్తున్నారు, ఇక జిల్లా నేతలతో బాబు కూడా ఇప్పటికే చర్చించారు.. ఎవరూ కూడా ఫలితాల తర్వాత పార్టీ మారకుండా జాగ్రత్తగా ఉండాలి అని సూచించారట.