జగన్ కేబినెట్ లో కొత్తగా వారికి ఛాన్స్….

జగన్ కేబినెట్ లో కొత్తగా వారికి ఛాన్స్....

0
95

ఇటీవలే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పిల్లిసుభాస్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు పోటీ చేసి విజయం సాధించారు.. నిబంధనల ప్రకారం రాజ్యసభకు ఎన్నిక అయిన 14 రోజులలోపు వారు ఎమ్మెల్సీలకు రాజీనామా చేయాలి ఇటీవలే వారిద్దరు రాజీనామా చేశారు.. రానున్న సెషన్స్ లో వీరిద్దరు ప్రమాణస్వీకారం చేయనున్నారు…. అయితే వీరిద్దరురాజ్యసభ్యకు వెళ్లడంతో రెండు పోస్టులు ఖాలీ అయ్యాయి…

ఈ రెండు పోస్టులు ఎవరికి దక్కే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది… గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణ ఆయన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మంత్రిపదవి దక్కే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు… ఇదే మంత్రి పదవికి సంబంధించి గతంలో విడుదల రజనీ పేరు కూడా తెరపైకి వచ్చింది…

ఫైబ్రాంగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు మంత్రిపదవి కన్ఫామ్ అని అందరు చర్చించుకున్నారు… పైగా విడుదల రజనీ కూడా మోపిదేవి సామాజికవర్గానికి చెందినవారే కావడంతో ఆమెకు జగన్ కేబినెట్ సీటు కన్ఫామ్ అని అందరు భావించారు… అలాగే మరికొందరి నేతల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి… మరి సీఎం జగన్ ఎవరిని తన కేబినెట్ లోకి తీసుకుంటారో చూడాలి…