ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో త్వరలో రెండు పోస్టులు ఖాళీ కానున్నాయి… ఆ రెండు పోస్టులకు జగన్ ఫిక్స్ చేశారా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి… మండలి రద్దు నేపథ్యంలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే మంత్రి మోపిదేవి వెంకటరమణలను పెద్దల సభకు పంపనున్నారు..
దీంతో జగన్ కేబినెట్ లో రెండు పోస్టులు ఖాళీ కానున్నాయి ఈ రెండు పోస్టుల్లో ఎవరిని నియమించాలనే దాని విషయంలో అధిష్టానం క్లారిటీగా ఉందని వార్తలు వస్తున్నాయి… మోపిదేవి గుంటూరు జిల్లావాసి కనుక ఆ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే విడుదల రజనీని జగన్ మంత్రిని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు…
అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పుగోదావరి జిల్లా వాసి కావడంతో ఆ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ను జగన్ తన కేబినెట్ లోకి తీసుకుంటారని చర్చించుకుంటున్నారు…