జగన్ క్లారిటీ విశాఖకు కొత్త వరాలు నిధులు విడుదల

జగన్ క్లారిటీ విశాఖకు కొత్త వరాలు నిధులు విడుదల

0
111

ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖ ఫిక్స్ అయింది.. ఇక రేపు జరిగే కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి జగన్ దీనిపై ప్రకటన చేయనున్నారు. ఇది మంత్రులు అందరూ ఒకే చేసిన తర్వాత ప్రజలకు తెలియచేసి అక్కడ నుంచి పరిపాలన స్టార్ట్ చేయనున్నారు. ఈ సమయంలో విశాఖ నగరాభివృద్ధికి భారీ వరాలు ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్ . విశాఖపట్నం మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA పరిధిలో రోడ్లు, డ్రైనేజీ లు, పార్కుల అభివృద్ధి, కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణం కోసం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ, వాటి కోసం నిధులు కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నిధుల విడుదలకు సంబంధించి వేర్వేరుగా 7 జీవోలను జారీ చేసింది.28న విశాఖకు జగన్ రానున్నారు పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. తాజాగా విశాఖకు కేటాయించిన నిధుల వివరాలు చూస్తే, విశాఖలో కాపులుప్పాడులో బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం 22.50 కోట్లు
కేటాయించారు అలాగే ఫేమస్ ప్లేస్ అయిన , కైలాసగిరి ప్లానిటోరియానికి 37 కోట్లు కేటాయించారు, అలాగే సిరిపురం జంక్షన్ లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వాణిజ్యసముదాయానికి 80 కోట్లు కేటాయించారు. మొత్తం ఇలా అన్ని పనులకి కలిపి 394 కోట్లు విడుదల చేసింది ఏపీ సర్కార్.

రేపు మంత్రి వర్గ భేటీ తర్వాత కీలక విషయాలు వెల్లడించనుంది… ఎప్పటి నుంచి అక్కడ రాజధాని స్టార్ట్ చేస్తారు అనేది కూడా రేపు క్లారిటీ ఇవ్వనుంది ఏపీ సర్కార్, అలాగే ఇక్కడ రైతుల విషయంలో కూడా కీలక నిర్ణయం వెల్లడించనుంది ప్రభుత్వం.