జగన్ డెసిషన్ బాగుంది సపోర్ట్ చేసిన ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్. రామ్

జగన్ డెసిషన్ బాగుంది సపోర్ట్ చేసిన ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్. రామ్

0
76

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యా భోధన ప్రవేశపెట్టాలి అని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి చాలా మంది ప్రశంసలు ఇస్తున్నారు, వచ్చే రోజుల్లో అంతా టెక్నాలజీ అలాగే ఇంగ్లీష్ తోనే ప్రపంచం ముందుకు వెళుతుంది.. ఈ సమయంలో తెలుగు నేర్చుకుంటూనే ఇంగ్లీష్ భాషపై పట్టుసంపాదించాలి అని సీఎం జగన్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాని దీనికి మాత్రం టీడీపీ జనసేన ఒప్పుకోలేదు.. తెలుగుని చంపేస్తారా అనేలా కామెంట్లు చేశారు, దీనికి అడ్డుకున్నారు, అయితే సీఎం జగన్ మాత్రం ఇంగ్లీష్ విద్యాభోధనకే ముందుకు సాగుతున్నారు, తాజాగా సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్. రామ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇదో చారిత్రాత్మక నిర్ణయమని, నాణ్యమైన విద్యను అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు.

ది హిందూ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో జగన్ ముఖ్య అతిథిగా హాజరై ఏపీలో తాము తీసుకుంటున్న నిర్ణయాలను వివరించి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడారు, ఏపీలో విద్యారంగంలో ఈ మార్పు చాలా మంచి పరిణామం అని అన్నారు. పేదవారి పిల్లలకు ఇది మంచి అవకాశం అని వారి భవిష్యత్తు బాగుంటుంది అని. దేశంలో ఏపీ ఈ విషయంలో మొదటిగా నిలుస్తుంది అని అన్నారు ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్. రామ్.