ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలను కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తుంది.. ఇప్పటివరకు ఏపీలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే…. అయితే కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి యనమల…
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలుత కరోనా ప్రభావం ఏమీ లేదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు హడావిడిగా అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు… అలాగే ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించాలంటే ఎన్నికల కమీషన్ అనుమతి తీసుకోవాలని సుప్రీకోర్టు చెప్పిందని తెలిపారు…
ఉగాది పండుగకు సర్కార్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది… అయితే ఇది కొత్త పథకమేనని దీనిని ప్రారంభించడానికి ఎన్నికల కమీషన్ అనుమతి తీసుకోవాలని తెలిపారు యనమల…