జగన్ కు తొలి విజయం ఈసి షాకింగ్ నిర్ణయం

జగన్ కు తొలి విజయం ఈసి షాకింగ్ నిర్ణయం

0
98

ఎన్నికల సమయంలో అధికారుల బదీలీలు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి ఈసీకి దీనిపై ఎవరైనా ఫిర్యాదు ఇస్తే వారు ఓ పార్టీకి అలాగే అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు అని చెబితే వెంటనే వారిపై బదిలీ వేటు వేస్తుంది ఎన్నికల సంఘం ఇక ఏపీలో కొన్ని నెలలుగా సీఎం చంద్రబాబుకి కొందరు అధికారులు సపోర్ట్ చేస్తున్నారు అని,ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ తమ వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలి అని చెబుతూనే ఉన్నారు ఇటీవల ఈసీకి ఫిర్యాదు కూడా అందించారు.. జగన్ మోహన్రెడ్డి ఫిర్యాదులపై స్పందించిన ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు మరో 14 రోజుల సమయం ముందు కీలక డెసిషన్ తీసుకుంది

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు శ్రీకాకుళం, కడప ఎస్పీలను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని, అలాగే ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఒక్కసారిగా అధికారులు కంగుతిన్నారు చంద్రబాబుకి షాక్ తగిలింది దీనిపై న్యాయపోరాటానికి తెలుగుదేశం సిద్దం అవుతోంది ఎన్నికల్లో వారికి ఎలాంటి విధులు లేవు అయినా ఆ అధికారులను టార్గెట్ చేయాల్సిన పని ఏముంది అని విమర్శిస్తున్నారు తెలుగుదేశం నేతలు మొత్తానికి కోర్టుకు వెళ్లినా ఈసీ నిర్ణయం కాబట్టి కోర్టు కూడా ఏమీ చేయలేదు అని చెబుతున్నారు కొందరు న్యాయనిపుణులు