జగన్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు

జగన్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు

0
87

ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రస్తావించారని జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే…..దీంతో ఆయన ఆయన బీజేపీకి టచ్ లో ఉన్నారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి…

ఇక దీనిపై ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అనంతరం రఘురామకృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను పార్టీ లైన్ ను ఎన్నడూ దాటలేదని అన్నారు… ఇంగ్లీష్ వాదాన్ని తాను పార్లమెంటులో ప్రస్తావించలేదని అన్నారు…

తాను నియోజకవర్గ పనులకోసమే కేంద్ర మంత్రులతో కలిశానని చెప్పారు… ప్రధాని మోదీ తనకు వ్యక్తి గతంగా తెలుసని సహజంగా ఎదరురైనప్పుడు పలుకరించానని అన్నారు రఘురామకృష్ణంరాజు… అలాగే సుజానాపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు… బీజేపీకి వైసీపీ నేతలు ఎవరు టచ్ లో ఉన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు…