విజయసాయిరెడ్డికి గుడ్ న్యూస్ వినిపించిన జగన్

విజయసాయిరెడ్డికి గుడ్ న్యూస్ వినిపించిన జగన్

0
86

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీలో నెంబర్ వనే అనే చెప్పాలి.. ఇక నెంబర్ 2 అంటే వెంటనే వినిపించే పేరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైయస్ కుటుంబానికి దగ్గర వ్యక్తి విజయసాయిరెడ్డి అంటారు, అయితే ఏ విషయం అయినా విజయసాయిరెడ్డి నుంచి నేరుగా జగన్ కు చేరుతుంది అంటారు.. ఆయనకు అంత విలువ ఇస్తారు పార్టీలో సీఎం జగన్.

అయితే కేంద్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మంచి ఆఫర్ వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు ఎన్డీయేలో చేరనున్నారు అని, కేంద్రమంత్రి వర్గ విస్తరణ జరుగనుంది అని, అందులో వైసీపీకి కేంద్రమంత్రి పదవి ఇవ్వనుంది అంటున్నారు.

అయితే ఇందులో వైసీపీ తరపున వైయస్ షర్మిల పేరు వినిపిస్తోంది.. ఆమెకి రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్రమంత్రి పదవి ఇస్తారు అని వార్తలు వస్తున్నాయి, ఈ సమయంలో తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది.. పార్టీ తరపున హస్తినలో రాజకీయాలు చూసుకునే వ్యక్తి పార్టీకి పదేళ్లుగా కమిట్మెంట్ తో ఉన్న విజయసాయి రెడ్డికి ఇస్తారు అని తెలుస్తోంది.. వైయస్ షర్మిలకు కేంద్ర మంత్రి పదవి పై ఆశ లేదని కొందరు అంటున్నారు.