జగన్ ఈరోజు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యి ఆయా రాష్ట్రాల సమస్యలను గురించి ఈ సమావేశంలో పేర్కొన్నారు. జగన్ రాష్ట్రంలోని పలు అంశాలను నీతి ఆయోగ్ ముందు ఉంచారు.
జగన్ ఈరోజు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యి ఆయా రాష్ట్రాల సమస్యలను గురించి ఈ సమావేశంలో పేర్కొన్నారు. జగన్ రాష్ట్రంలోని పలు అంశాలను నీతి ఆయోగ్ ముందు ఉంచారు.ఆంధ్రప్రదేశ్ విభజన క్రమంలోనే కొత్త రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగింది. 59శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 47 శాతం మాత్రమే ఆదాయాన్ని పంచారు. అత్యంత ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్లడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది ఐటీ సెక్టార్ హైదరాబాద్‌కి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది
తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం చాలా తక్కువ. ఈ నష్టాన్ని పూడ్చడానికి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఆ హామీని అప్పటి అధికార, విపక్ష పార్టీలేవీ నిలబెట్టుకోలేదు. విభజన నాటికి 97 వేల కోట్లుగా ఉన్న మా అప్పు నేటికి 2.59 లక్షల కోట్లకు చేరింది..అప్పుల్లో అసలు, వాటిపై వడ్డీలకు కలిపి ఏడాది రూ. 40 వేల కోట్ల భారం మా రాష్ట్రంపై పడుతోంది.ఉపాధి కల్పన అవకాశాలు దారుణంగా పడిపోయాయి. మా యువత వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చగలదు.