మహారాష్ట్ర రాజకీయాలపై జగన్ ఆసక్తికర కామెంట్స్

మహారాష్ట్ర రాజకీయాలపై జగన్ ఆసక్తికర కామెంట్స్

0
115

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…. మహాత్మాజ్యోతిరావు పూలే వర్థంతి పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై పలు వ్యాఖ్యలు చేశారు…

కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ అట ఎన్సీపీకి డిప్యూటీ సీఎం అట అంతలావు మహారాష్ట్రకు ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఇచ్చారు… మన రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో సుమారు 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించామని అన్నారు…

అంతేకుదు దేశంలో ఎక్కడా లేని విధంగా డిప్యూటీ సీఎంగా అదే వర్గానికి చెందిన వారికి నియమించామని అన్నారు… ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని జగన్ అన్నారు… ఎప్పుడూ ఎక్కడా చూడని విధంగా బీసీల సంక్షేమానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని అన్నారు…