జగన్ కరుణిస్తే వీరందరూ వైసీపీలోకేనట…

జగన్ కరుణిస్తే వీరందరూ వైసీపీలోకేనట...

0
78

ఈ ఎన్నికల్లో మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తామని అంచనాలను వెసిన తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది… దీంతో పార్టీలో ఉన్న బాడానేతలు సైతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు… ఇందులో ఎక్కువమంది గతంలో టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు…

అందులో ముందు వరుసలో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ఉన్నారు… 2014 ఎన్నికలో వైసీపీ తరపున గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు… 2019లో టీడీపీ తరపున పోటీ చేసినా కూడా ఓటమి చెందారు…

దీంతో కొద్దికాలంగా ఆయన వైసీపీకి దగ్గర అయ్యేందుకు చూస్తున్నారు… జూపుడి లాగే తనను కూడా వైసీపీ కరుణిస్తే వైసీపీలో చేరుతానని అంటున్నారు… ఇక ఆయనతో పాటు వంతల రామేశ్వరి, జ్యోతుల నెహ్రూ గిడ్డిఈశ్వరీలు మళ్లీ సొంత గూటికి చేరేందుకు సిద్దమయ్యారట…