జగన్ కొత్త డ్రామాలుకు షురూ

జగన్ కొత్త డ్రామాలుకు షురూ

0
90

మొన్నటి వరకూ అమరావతిని భ్రమరావతి అన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిజాలు ప్రపంచానికి తెలిసాక కొత్త పాట మొదలుపెట్టారని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఖర్చు చేసింది రూ.5 వేల కోట్లే, రాజధాని అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్లు కావాలి అంటూ కొత్త డ్రామా షురూ చేసారని మండిపడ్డారు…

28.06.19న ఏపీ సీఆర్డీఏపై వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో రూ. 9,165 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి ఖర్చు చేసింది అని చెప్పారు. అమరావతి ఫైనాన్షియల్ ప్లాన్ గురించి ఫిభ్రవరి 2019లో టీడీపీ ప్రభుత్వం జీవో 50 విడుదల చేసిందని లోకేశ్ అన్నారు

అందులో అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.55,343 కోట్లు. ఇందులో రాబోయే 8 ఏళ్లలో ఖర్చు పెట్టాల్సింది రూ.6629 కోట్లు. ప్రభుత్వానికి మిగిలే భూమితో మిగిలిన ఖర్చు అంతా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారానే వస్తుందని అన్నారు

అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలనేది చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. విశాఖలో తన ల్యాండ్ మాఫియా అభివృద్ధి కోసం ఉన్న అమరావతిని చంపేసి కొత్త రాజధాని అంటున్నారని లోకేశ్ ఆరోపించారు..