జగన్ కు అదేగతి పడుతుందా….

జగన్ కు అదేగతి పడుతుందా....

0
85

ఏపీ ముఖ్యంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్నారు… ఈ ఆరు నెలల పాలనపై బీజేపీ నాయకులు స్పందించారు… జగన్ పాలనలో ఆదాయం 69 వేల కోట్లు, అప్పులు 30 వేల కోట్లుగా ఉందని అన్నారు…

జగన్ ప్రభుత్వం అప్పులను 3.40 లక్షల కోట్లకు చేర్చిందని ఎద్దేవా చేశారు… రాజధాని నిర్మానం, ప్రాజెక్టుల నిర్మాణాలు ఎక్కడివక్కడే ఉండిపోయాయని ఆరోపించారు… ఈ ఆరు నెలల్లో వైసీపీ సర్కార్ 56 కోట్ల ఉచిత పథకాలను ప్రకటించిందని ఎద్దేవా చేశారు…

గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏగతి అయితే పట్టిందే అదే గతి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పడుతుందని బీజేపీ నాయకులు ఆరోపించారు… నేటి యుగంలో పిల్లలకు ఇంగ్లీష్ అవసరమేనని కానీ దానితో పాటు మాతృ భాష కూడా ఉండాలని చెప్పారు…